మీ సేవ మొదలు
ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో అమలు
త్వరలో కృష్ణా, ఖమ్మం జిల్లాలో కూడా
2012 నాటికి రాష్ట్రమంతటా.. అవినీతి నిర్మూలనే లక్ష్యం
ఇప్పుడు 15 సేవలు.. మార్చి నాటికి 50 సేవలు
15 నిమిషాల్లో పౌరులకు ప్రభుత్వ పత్రాల జారీ
పౌర సేవా హక్కుల చట్టం రూపకల్పన
మీ సేవ కేంద్రాల నుంచి రైతులకు సమాచారం కూడా
ప్రాజెక్టును తిరుపతిలో ప్రారంభించిన సీఎం కిరణ్

తిరుపతి, నవంబర్ 4: సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి మానసపుత్రిక 'మీ సేవ' కార్యరూపం దాల్చింది. వివిధ కార్యాలయాల్లో లభించే ప్రభుత్వ పత్రాలన్నీ పౌరులకు ఒకే చోట ఇవ్వడమే లక్ష్యంగా తలపెట్టిన 'మీ సేవ' పైలట్ ప్రాజెక్టుకు చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారమిక్కడి మహతి ఆడిటోరియంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అవినీతిని రూపుమాపేందుకే 'మీ సేవ'ను ప్రారంభించినట్లు తెలిపారు.
మొదటి దశలో చిత్తూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టు అమలు ఆలస్యమైందన్నారు. "ప్రస్తుతం 15 సేవలతో ప్రారంభించిన మీ సేవ ప్రాజెక్టు ద్వారా మార్చి 31 లోగా 50 సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2012 డిసెంబర్ 31 లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మీ సేవ కేంద్రాలను ప్రారంభిస్తాం'' అని ప్రకటించారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు నెలల తరబడి తిరగకుండా 15 నిమిషాల్లో వారికి అవసరమైన సర్టిఫికెట్లను అధికారుల డిజిటలైజ్‌డ్ సంతకాలతో 'మీ సేవ' ద్వారా పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు. పౌరులకు కావాల్సిన ప్రభుత్వ పత్రాలు సకాలంలో ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం పౌరసేవా హక్కుల చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. "ఆన్‌లైన్ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. మీ సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని కూడా అందించాలని ఆలోచిస్తున్నాం'' అని చెప్పారు.
అనంతరం మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 'మీ సేవ' పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తుందన్నారు. ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రసంగిస్తూ.. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు.. 'పారదర్శకత, ఉపాధి' నినాదంతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు.
Source:AJ

No comments:
Post a Comment