Friday, November 4, 2011

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు

అగ్రరాజ్యంలో ఆకలి కేకలు
అమెరికాలో 4.62 కోట్ల మంది పేదలు..
బ్రూకింగ్స్ సంస్థ నివేదిక

వాషింగ్టన్, నవంబర్ 4: అగ్రరాజ్యంలో నాలుగున్నర కోట్ల మందికిపైగా పేదవాళ్లే! ప్రపంచ వ్యాప్తంగా డాలర్లు కురిపించే అమెరికాలోనే పేదరికం తీవ్ర స్థాయికి చేరింది. ఆ దేశ ప్రమాణాల ప్రకారం సుమారు 4.62కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని అంచనా. దారిద్య్రం ఈ స్థాయికి చేరడం అమెరికా చరిత్రలోనే తొలిసారి. ఇక్కడి బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ అనే అధ్యయన సంస్థ ఈ మేర కు ఓ నివేదిక విడుదల చేసింది.

గత దశాబ్దంలో రెండుసార్లు తలెత్తిన ఆర్థిక సంక్షోభం మూలంగా సగ టు అమెరికన్ల సంపద హరించుకుపోయిందని, 1990లలో కూడబెట్టుకున్నదంతా కోల్పోయారని ఈ నివేదిక తేల్చింది. ఉత్పాదక రంగం క్షీణించడం, నిరుద్యోగిత 9శాతానికి ఎగబాకడం వంటి కారణాలతో డెట్రాయిట్, ఒహియో, టొలెడో వంటి కొన్ని పశ్చిమ నగరాల్లో పేదరికం దశాబ్ద కాలంలో రెడింతలైందని బ్రూకింగ్స్ తెలిపింది.

ఇక దక్షిణాది ప్రాంతాలైన టెక్సాస్, లూసియానా, ఎల్‌పాసో వంటి నగరాల్లో ఇది మూడోవంతుకు పెరిగిందని, ఈ ప్రాంతాల్లో నేరాల సంఖ్య కూడా అధికమవుతోందని ఆ నివేదిక చెబుతోంది.

Source: AndhraJyothy

No comments:

Post a Comment